సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు అనంతపురం జిల్లా చక్కటి ఉదాహరణ: నారా లోకేశ్ విమర్శలు

  • వైద్య సిబ్బందికి ప్రభుత్వం కనీస సదుపాయాలు అందించట్లేదు
  • మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలను ఇవ్వలేదు
  • ఈ జిల్లాలో కరోనా బారిన పడిన వారిలో వైద్యులు, నర్సులే అధికం
  • కరోనాపై యుద్ధం చేస్తోన్న వారికి  ఆయుధాలు ఇవ్వడం లేదు 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులకు కూడా సరైన సదుపాయాలు కల్పించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

'సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు అనంతపురం జిల్లా చక్కటి ఉదాహరణ. కరోనా విజృంభణ నేపథ్యంలో ముందుండి పనిచేస్తోన్న వారికి కనీస సదుపాయాలైన మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలను ఇవ్వలేదు. ఈ జిల్లాలో కరోనా బారిన పడిన వారిలో వైద్యులు, నర్సులే అధికంగా ఉన్నారు. కరోనాపై యుద్ధం చేస్తోన్న వారికి ఈ ప్రభుత్వం ఆయుధాలు (మాస్కులు, పీపీఈ కిట్లు) ఇవ్వడం లేదు' అని నారా లోకేశ్ విమర్శలు గుప్పిస్తూ, అందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు.

సదుపాయాలు కల్పించాలని వైద్య సిబ్బంది విజ్ఞప్తులు, నిరసనలు చేశారని, చివరకు సస్పెండ్‌ కూడా అయ్యారని లోకేశ్ అన్నారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.


More Telugu News