మూడు రోజుల సెలవు ఎఫెక్ట్...గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు భారీగా మామిడి రాక
- ఈరోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ ను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
- తెలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తిన రైతులు
- ఒక్కరోజు ఏకంగా 1600 టన్నుల కాయల రాక
హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడి రైతులు పోటెత్తారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈరోజు అర్ధరాత్రి నుంచి మూడు రోజులపాటు మార్కెట్ మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా రైతులు మార్కెట్‌కు తరలివచ్చారు.
ఈ ఒక్కరోజే ఏకంగా 1600 టన్నుల మామిడి కాయలు మార్కెట్‌కు రావడం గమనార్హం. దీంతో మార్కెట్ ప్రాంగణం కిటకిటలాడుతోంది. రైతుల ప్రయోజనం దృష్ట్యా ఈరోజు అర్ధరాత్రిలోగా కొనుగోళ్లు పూర్తయ్యేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అదే సమయంలో రేపటి నుంచి ఎవరూ మూడు రోజులపాటు మామిడి తేవొద్దని, లోపలికి అనుమతించమని మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్‌నర్సింహగౌడ్ తెలిపారు. అలాగే కోహెడ్‌లో మామిడి విక్రయాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఈనెల 27 నుంచి ఇక్కడ కొనుగోళ్లకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.