ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నివేదా థామస్

  • అడవి చుట్టూ అల్లుకున్న అవినీతి
  • ఎర్రచందనం తరలింపులో పెద్ద తలకాయలు
  • ఆమె పాత్ర కథను మలుపు తిప్పుతుందట
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందనుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అడవి నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా, అడవికి చుట్టూ అల్లుకున్న అవినీతి వెనకున్న పెద్ద తలకాయల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నాయికగా రష్మిక కనిపించనుంది. మరో కథానాయికగా నివేదా థామస్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఆమె పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఈ సినిమాలో సిన్సియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా, చాలా కీలకమైనదని అంటున్నారు. ఆమె పాత్ర కారణంగానే హీరో అడవిలోకి అడుగుపెడతాడని చెబుతున్నారు. సుకుమార్ ఒక్కో ఆర్టిస్టును తీసుకుంటూ .. అంచనాలు పెంచుకుంటూ వెళుతున్నాడు.


More Telugu News