'లూసిఫర్' రీమేక్ లో కీలకమైన మార్పులు
- మోహన్ లాల్ స్థాయికి తగిన 'లూసిఫర్'
- తెలుగు రీమేక్ లో చిరంజీవి
- త్వరలో చిరూ ముందుకు తెలుగు స్క్రిప్ట్
మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. దాంతో ఈ సినిమాను చిరంజీవి కథానాయకుడిగా తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడు. రీమేక్ దర్శకత్వ బాధ్యతలను 'సాహో' దర్శకుడు సుజీత్ కి అప్పగించారు.
మలయాళంలో మోహన్ లాల్ కి జోడీ ఉండదట. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా చిరూకి జోడీని సెట్ చేయాలనే అభిప్రాయంతో వున్నారని అంటున్నారు. అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాల్లోను మార్పులు చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకు తగినట్టుగానే స్క్రిప్టులో సుజీత్ మార్పులు చేస్తున్నాడట. తను చేసిన మార్పులు త్వరలో చిరంజీవికి వినిపిస్తాడట. ఓకే అనుకుంటే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని సమాచారం.