జర్నలిస్టులపై కరోనా పడగ...పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న బాధితులు
- చెన్నైలో మరో పది మందికి పాజిటివ్
- విధుల నిర్వహణలో భాగంగా పలువురితో మమేకం
- కార్యాలయ సిబ్బందికి కూడా విస్తరిస్తుందేమో అన్న ఆందోళన
విధి నిర్వహణలో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. పలు రాష్ట్రాల్లో వీరి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చెన్నై నగరంలో పనిచేసే మరో పది మంది జర్నలిస్టులకు పాజిటివ్ తేలడంతో ఆందోళన నెలకొంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే 50 మంది జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు.
చెన్నైలో 27 మందికి పాజిటివ్ అని నిన్నటి వరకు లెక్కలు ఉండగా తాజాగా ఈరోజు మరో పది మందికి పాజిటివ్ అని తేలింది. జర్నలిస్టులు వేగంగా వైరస్ బారిన పడుతుండడంతో మీడియా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. వారు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కార్యాలయాలకు వస్తే అక్కడి సిబ్బందికి ఎక్కడ విస్తరిస్తుందో అన్న ఆందోళన నెలకొంటోంది. అదే సమయంలో క్షేత్ర స్థాయి విధులు నిర్వహించే వారికి వైరస్ సోకకుండా ఏ చర్యలు చేపట్టాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.