సూర్యాపేటపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశాలు!
- సూర్యాపేటలో పెరుగుతున్న కాంటాక్ట్ కేసులు
- కేసీఆర్ ఆదేశాలతో కదిలిన అధికార బృందం
- నేడు క్షేత్రస్థాయి పర్యటనకు సీఎస్, డీజీపీ
తెలంగాణలో జీహెచ్ఎంసీ తరువాత సూర్యాపేటలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు అధికారులకు తలనొప్పిగా మారాయి. ఈ ప్రాంతం నుంచి న్యూఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉండటం, వారిలో అత్యధికులు కూరగాయలు, నిత్యావసరాల వ్యాపారంలో ఉండటంతో కాంటాక్ట్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది.
దీంతో సూర్యాపేట పట్టణంపై మరింత శ్రద్ధ పెట్టాలని, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసి, వైరస్ లింక్ ను కట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాలతో నేడు సూర్యాపేటలో సీఎస్ తో పాటు డీజీపీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ తదితరులతో కూడిన బృందం వెళ్లి, క్షేత్ర స్థాయి పరిస్థితులను సమీక్షించనుంది.