'ఆర్ ఆర్ ఆర్' కోసం మలయాళం నేర్చుకుంటున్న ఎన్టీఆర్
- ఇంటిపట్టునే వున్న ఎన్టీఆర్
- మలయాళ భాషపై దృష్టి
- ఆ భాషల్లో డబ్బింగ్ చెప్పాలనే పట్టుదల
ఎన్టీఆర్ .. చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఇక 25 శాతం చిత్రీకరణ జరిపితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి చరణ్ వీడియోను రిలీజ్ చేశారు. ఒక్క మలయాళ వెర్షన్ కి సంబంధించి తప్ప మిగతా భాషల్లో ఆ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పాడు.
ఆ సమయంలోనే మలయాళం కూడా నేర్చుకోవాలనీ, మలయాళ వెర్షన్లో విడుదలయ్యే సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వున్న ఎన్టీఆర్, మలయాళ భాషను నేర్చుకుంటున్నాడట. ఈ భాషపై పట్టు సాధించడానికి ఆయన గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.