లక్ష ఇస్తే ఇంటికి వస్తానంటూ... అమ్మాయి పేరిట మోసం!

  • ఆన్ లైన్లో వచ్చిన ప్రకటనకు ఆకర్షితుడైన బొల్లారం నివాసి
  • సంప్రదించడంతో అమ్మాయి పేరిట చాటింగ్
  • డబ్బు కొట్టేసి ఫోన్ స్విచ్చాఫ్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
'అమ్మాయిలతో స్నేహం' పేరిట సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కుకుని, రూ. 91 వేలు పోగొట్టుకున్నాడో హైదరాబాద్ వ్యక్తి. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, 'యువతులతో స్నేహం చేయాలంటే, వాట్సాప్ కు మెసేజ్ చేయండి' అంటూ ఆన్ లైన్ లో తాను చూసిన ప్రకటనకు ఆకర్షితుడైన బొల్లారం ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆ నంబర్ ను సంప్రదించాడు. దీంతో అతనికి వెంటనే సమాధానం వచ్చింది. అతనితో అమ్మాయిలానే చాటింగ్ చేయడాన్ని ప్రారంభించారు.

తాను మీ ఇంటికి వస్తానని, అయితే, ముందుగా తనకు లక్ష రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయాలని అమ్మాయి షరతు విధించడంతో, తాను మాట్లాడుతున్నది ఓ అమ్మాయితో అన్న ఆలోచనలో ఉన్న సదురు వ్యక్తి, ముందూ, వెనుకా చూడకుండా రూ. 91 వేలను పంపించాడు. డబ్బులు తమకు అందగానే, బాధితుడి నంబర్ ను బ్లాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆపై తమ ఫోన్ ను కూడా స్విచ్చాఫ్ చేశారు. దీంతో తాను ఘోరంగా మోసపోయానని భావించిన బాధితుడు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.


More Telugu News