ఏపీలో కొవిడ్ ఆసుపత్రులకు 100 మంది స్పెషలిస్టు డాక్టర్ల నియామకం

  • కరోనా విజృంభణ నేపథ్యంలో డాక్టర్ల నియామకం
  • ఈ-మెయిల్స్ ద్వారా అపాయింట్ మెంట్ ఆర్డర్లు
  • 48 గంటల్లో విధుల్లో చేరాలన్న ఆరోగ్యశాఖ
ఏపీలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు డాక్టర్ల నియామకం చేపట్టింది. రాష్ట్రంలోని కొవిడ్ ఆసుపత్రుల్లో సేవలు అందించేందుకు 100 మంది స్పెషలిస్టు డాక్టర్లను నియమించింది. కొత్తగా ఎంపిక చేసిన వైద్యుల్లో జనరల్ మెడిసిన్, అనస్తీషియా, పల్మనాలజీ నిపుణులు ఉన్నారు.

ఎంపికైన వారికి ఈ-మెయిల్స్ ద్వారా అపాయింట్ మెంట్ ఆర్డర్లు పంపినట్టు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 48 గంటల్లో వైద్యులు తమకు కేటాయించిన విధుల్లో జాయిన్ అవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా ఎంపికైన వైద్యులకు భవిష్యత్ నియామకాల్లో 15 శాతం వెయిటేజీ ఉంటుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 మంది మరణించినట్టు అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.


More Telugu News