రేపటి నుంచి ఉన్నతాధికారులు జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • ‘కరోనా’ వ్యాప్తి నివారణాచర్యలు, లాక్ డౌన్ అమలుపై సమీక్ష
  • హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్ష
  • రేపు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లో అధికారుల పర్యటన
‘కరోనా’ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘కరోనా’ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ప్రగతిభవన్ లో ఇవాళ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిపై సమీక్షించిన కేసీఆర్, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పర్యటించనున్నారు.


More Telugu News