మధ్యప్రదేశ్ మంత్రివర్గం విస్తరణ... ఐదుగురి ప్రమాణ స్వీకారం!
- మార్చి 23న సీఎంగా పదవీప్రమాణం చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్
- ఇప్పటివరకు మంత్రుల్లేకుండానే పాలన
- కాంగ్రెస్ విమర్శలతో మంత్రుల ఎంపిక
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మార్చి 23న పదవీ ప్రమాణం చేసినప్పటి నుంచి క్యాబినెట్ లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు క్యాబినెట్ లో మంత్రులెవరూ లేకుండానే పాలన కొనసాగించారు. కరోనా రక్కసి కోరలు చాస్తున్న తరుణంలోనూ అంతా తానై నెట్టుకొచ్చారు. అయితే పరిస్థితి మరీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణకు నడుం బిగించారు. తాజాగా ఐదుగురికి తన క్యాబినెట్ లో స్థానం కల్పించారు. దాంతో మధ్యప్రదేశ్ మంత్రివర్గానికి ఓ రూపు ఏర్పడింది.
కరోనా విజృంభిస్తుంటే మంత్రులను ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ కాంగ్రెస్ అదేపనిగా విమర్శిస్తుండడంతో సీఎం శివరాజ్ సింగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు పదవీప్రమాణం చేశారు. నరోత్తమ్ మిశ్రా, గోవింద్ సింగ్ రాజ్ పుత్, మీనా సింగ్, కమల్ పటేల్, తులసీరామ్ సిలావత్ మంత్రులుగా చాన్స్ దక్కించుకున్నారు.