కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలలో మీడియా స్వేచ్ఛ... 142వ స్థానంలో భారత్!

  • వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ విడుదల
  • అగ్రస్థానంలో నార్వే
  • చివరి స్థానంలో ఉత్తర కొరియా
కరోనా మహమ్మారి అనేక దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వార్తలను ప్రజలకు అందించడం మీడియాకు కత్తిమీద సాములాంటిది. ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా తాము చెప్పిన సమాచారాన్నే ప్రసారం చేయాలంటూ ఆంక్షలు విధిస్తుంటాయి. ఈ తరహా విపత్తులు మీడియా స్వేచ్ఛకు సంకట పరిస్థితులు సృష్టిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ద్వారా ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. 180 దేశాల్లో సమాచార, ప్రసార మాధ్యమాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు.

 ఈ జాబితాలో మీడియా స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న దేశంగా నార్వే తన ప్రథమస్థానాన్ని నిలుపుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, జమైకా తదితర దేశాలున్నాయి. మీడియా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న ఉత్తర కొరియా సహజంగానే చివరి స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో భారత్ 142వ స్థానం దక్కించుకుంది. పొరుగుదేశం పాకిస్థాన్ 145వ స్థానంలో నిలిచింది. తాను చెప్పిందే మీడియాలో రావాలి అన్నట్టుగా వ్యవహరించే ఆసియా పెద్దన్న చైనాకు ఈ లిస్టులో 177వ ప్లేసు లభించింది. ఈ మీడియా స్వేచ్ఛ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా 45వ స్థానం దక్కించుకుంది.


More Telugu News