నెల రోజుల్లో రూ. 2 కోట్ల జరిమానాలను విధించిన విశాఖ రూరల్ పోలీసులు!
- లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై విశాఖ రూరల్ పోలీసుల ఉక్కుపాదం
- నెల రోజుల్లో 3,702 లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు
- నిన్న ఒక్క రోజే రూ. 8.48 లక్షల జరిమానాలు
లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై విశాఖ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఒక నెల వ్యవధిలోనే నిబంధనలు ఉల్లంఘించిన వారికి సుమారు రూ. 2 కోట్ల వరకు జరిమానాలను విధించారు. నిన్న ఒక్కరోజు లోనే రూ. 8.48 లక్షల ఫైన్లు విధించారు. 94 వాహనాలను స్వాధీనం చేసుకుని, 185 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.
నిబంధనలను వ్యతిరేకిస్తున్న వారిపై మార్చి 22 నుంచి పోలీసులు జరిమానాలను విధించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు మొత్తం 3,702 లాక్ డౌన్ ఉల్లంఘన కేసులను నమోదు చేశారు. 1,398 వాహనాలను సీజ్ చేశారు. 4,197 మందిని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 38,135 కేసులు నమోదయ్యాయి.