'మేజర్' పైనే శోభిత ధూళిపాల ఆశలు

  • బయోపిక్ గా రూపొందుతున్న 'మేజర్'
  • కీలకమైన పాత్రలో శోభిత ధూళిపాల
  • ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో శోభిత ధూళిపాల తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ వెళుతోంది. తెలుగులో ఆమె చేసిన 'గూఢచారి' సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ ఆమె అడివి శేష్ కథానాయకుడిగా రూపొందుతున్న 'మేజర్' సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని తెలుస్తోంది. చాలా ఎమోషనల్ గా వుంటుందట. ఇంతవరకూ చేయని పాత్రలో ఆమె కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇది తన కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుందనీ, తెలుగు నుంచి ఈ సినిమా మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. గతంలో ముంబై టెర్రర్ ఎటాక్ లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.


More Telugu News