క్రూడాయిల్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 1,011 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 280 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 12 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా బెంచ్ మార్క్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో క్రూడాయిల్ ధరలు సున్నా కంటే దిగువకు పడిపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, అన్ని సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,011 పాయింట్లు పతనమై 30,636కి పడిపోయింది. నిఫ్టీ 280 పాయింట్లు కోల్పోయి 8,981 వద్ద స్థిరపడింది. టెలికాం మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ లో భారతి ఎయిర్ టెల్ (1.97%), హీరో మోటోకార్ప్ (1.18%), నెస్లే ఇండియా (0.21%) శాతం లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-12.30%), బజాజ్ ఫైనాన్స్ (-9.04%), యాక్సిస్ బ్యాంక్ (-7.61%), టాటా స్టీల్ (-7.11%), మహీంద్రా అండ్ మహీంద్రా (-6.63%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.


More Telugu News