దేశంలో కరోనా కేసులు రెట్టింపవుతున్న సమయం తగ్గడంపై ప్రశాంత్ కిశోర్ అనుమానాలు
- కేసుల రెట్టింపు వేగం 7.5 రోజుల నుంచి 3.4 తగ్గిందన్న కేంద్రం
- కేంద్ర ప్రకటనను తప్పుపట్టిన ప్రశాంత్ కిశోర్
- అవసరమైన మేరకు టెస్టులు చేయడం లేదంటూ ఆరోపణ
కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న విధానాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలి నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా లాక్ డౌన్ అమలు చేసిన విధానాన్ని కూడా తప్పుబడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అయ్యే రోజుల వ్యవధి తగ్గిందని కేంద్రం ప్రకటించడాన్ని కూడా తప్పుపట్టారు. కేసుల పెరుగుదల వేగం తగ్గిందంటే... అవసరమైన మేరకు టెస్టింగులు చేయడం లేదనే అనుమానాలు కూడా కలుగుతాయని అన్నారు.
లాక్ డౌన్ కు ముందు కరోనా కేసులు 7.5 రోజులకు రెట్టింపు అయ్యేవని... ప్రస్తుతం ఆ రేటు 3.4 రోజులకు తగ్గిందని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. గత వారం రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపడిందని తెలిపింది. చేసిన టెస్టుల్లో ఎంత శాతం కరోనా పాజిటివ్ వచ్చిందో చూడాలని అన్నారు.