కరోనా ముప్పున్న దేశాల్లో భారత్@15

  • జాబితా రూపొందించిన డీప్ నాలెడ్జ్ గ్రూప్
  • అధికముప్పున్న దేశంగా నంబర్ వన్ స్థానంలో ఇటలీ
  • కరోనా సురక్షిత దేశాల్లో ఇజ్రాయెల్ కు అగ్రస్థానం
కరోనా వైరస్ భూతం ఎవరిపైనా కనికరం చూపడంలేదు. 200కి పైగా దేశాల్లో కరాళ నృత్యం చేస్తోంది. లక్షల సంఖ్యలో మరణాలతో యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో డీప్ నాలెడ్జ్ గ్రూప్ కరోనా ముప్పు అధికంగా ఉన్న దేశాలతో ఓ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 15వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఇటలీ ఉంది. ఇటలీలో ఇప్పటివరకు 1.81 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 24,114 మరణాలు సంభవించాయి.  

ఈ కరోనా ర్యాంకింగ్స్ లో ఇటలీ తర్వాత అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. అమెరికాలో 7.99 లక్షలు కేసులు నమోదు కాగా, 42,897 మంది మరణించారు. బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ కరోనా విలయం సృష్టిస్తోంది. భారత్ తర్వాత 16వ స్థానంలో శ్రీలంక, 17వ స్థానంలో ఇండోనేసియా దేశాలున్నాయి.

ఇక డీప్ నాలెడ్జ్ గ్రూప్ కరోనా సురక్షిత దేశాల జాబితా కూడా రూపొందించింది. ఈ జాబితాలో ఇజ్రాయెల్ అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానంలో జర్మనీ, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, చైనా ఉన్నాయి.


More Telugu News