రూ. 45కే ఎన్95ను పోలిన స్వదేశీ మాస్కు
- ‘కవచ్’ పేరుతో రూపొందించిన ఢిల్లీ ఐఐటీ స్టార్టప్
- ఎన్95లో ఉండే ప్రమాణాలు కవచ్‌లో కూడా
- ఉతికి పదిసార్లు వాడుకునే సౌలభ్యం
కరోనా నేపథ్యంలో దేశంలోని శాస్త్రవేత్తలు, నిపుణులు అనేక కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ ఖర్చుతో ఐసీయూ వెంటిలేటర్ల నుంచి కరోనా టెస్టింగ్ కిట్ల వరకూ తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో వైరస్ నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఎన్95 మాస్కును పోలిన స్వదేశీ ఫేస్‌మాస్కును ఢిల్లీ ఐఐటీకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ రూపొంచింది. దీనికి ‘కవచ్’ అనే పేరు పెట్టింది.
ప్రస్తుతం ఎన్95 మాస్కులు ఎక్కువగా అందుబాటులో లేవు. వాటి ధర కూడా అధికమే. 98 శాతం స్వచ్ఛమైన ఈ మాస్కును ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో, ఎన్95లో ఉండే అన్ని ప్రమాణాలతో సదరు స్టార్టప్ కంపెనీ ‘కవచ్’ మాస్కును రూపొందించింది. ఇది కూడా మెరుగైన రక్షణ కల్పిస్తుందని చెప్పింది. దీని ధర కేవలం రూ. 45 మాత్రమే. ఈ మాస్కును కనీసం పదిసార్లు ఉతికి వాడుకోవచ్చని తెలిపింది.