జగన్ గారు కరోనా టెస్టింగ్ కిట్ల కమీషన్ లెక్కపెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు!: బుద్ధా వెంకన్న సెటైర్
- ఇతర రాష్ట్రాల సీఎంలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడి
- జగన్ మాత్రం తాడేపల్లి ఇంటికి పరిమితమయ్యారని విమర్శలు
- కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా
దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కరోనా కష్టకాలంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే జగన్ మాత్రం తాడేపల్లి ఇంటికే పరిమితమై కరోనా టెస్టింగ్ కిట్ల కమీషన్ లెక్కపెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపత్తులో కూడా జగన్ స్వలాభం వేసుకోవడం దారుణమని విమర్శించారు. ప్రజలకు అందించాల్సిన సాయం, పంట కొనుగోళ్లు ఇలా అన్ని కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో ఉంటూ పర్యవేక్షణ చేస్తున్నారని, కానీ జగన్ మాత్రం ప్రజల ప్రాణాలు గాలికి వదిలారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ తొలగింపు, మూడు ముక్కల రాజధాని ఏర్పాటు, కక్ష సాధింపు చర్యల్లో జగన్ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.