అందుకే 'జబర్దస్త్' నుంచి తప్పుకోవలసి వచ్చింది: కమెడియన్ సత్య
- 'జబర్దస్త్' మంచి గుర్తింపు తెచ్చింది
- సినిమాల్లో అవకాశాలు పెరుగుతూ వచ్చాయి
- మంచి పాత్రలు పడటం నా అదృష్టమన్న సత్య
తెలుగులో హాస్య నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారి జాబితాలో సత్య కూడా కనిపిస్తాడు. 'స్వామిరారా' సినిమా నుంచి కమెడియన్ గా దూసుకెళుతూ, యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రంగా వున్న సమయంలో 'జబర్దస్త్' చేయడం మొదలుపెట్టాను. ధన్ రాజ్ టీమ్ లో స్కిట్స్ చేస్తూ వెళ్లాను.
'జబర్దస్త్' నాకు మంచి గుర్తింపు తెచ్చింది .. మంచి పారితోషికం కూడా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సినిమాల్లో అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. అయితే వాటిని నమ్ముకుని జబర్దస్త్ వదిలేయడమనేది సాహసంతో కూడిన పనే. అయినా తెగించి 'జబర్దస్త్' మానేశాను. అదృష్టం కొద్దీ ఆ తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు. అలా వచ్చిన పాత్రలు నన్ను నేను నిరూపించుకునేవి .. నిలదొక్కుకునేవి కావడం మరో అదృష్టం. నా తాజా చిత్రాలుగా 'రెడ్' .. 'సోలో బ్రతుకే సో బెటర్' .. 'శ్రీకారం' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి" అని చెప్పుకొచ్చాడు.