వైద్య సిబ్బంది రక్షణ మన బాధ్యత: గల్లా జయదేవ్
- వారిపై దాడులను నిరోధించాలి
- వైద్యుల రక్షణ బిల్లుపై కేంద్ర హోంశాఖ పునరాలోచన చేయాలి
- గతంలో ఈ బిల్లును వెనక్కిపంపిన హోం శాఖ
వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన బిల్లును హోం శాఖ వెనక్కిపంపడం సరికాదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. దీనిపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
‘ఆ భగవంతుడికి మనుషుల్ని సృష్టించే శక్తి ఉంటే.. వైద్యులకు ప్రాణాలు కాపాడే శక్తి ఉంది. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించే బిల్లును పక్కనపెట్టిన కేంద్ర హోం శాఖ తన వైఖరిని పున:పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై ఎలాంటి శారీరక, మానసిక వేధింపులు జరగకుండా రక్షించుకోవడం మన బాధ్యత. వారిపై ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలి’ అని జయదేవ్ వరుస ట్వీట్స్ చేశారు.
వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి, ఆస్తుల ధ్వంసం జరుగకుండా నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గతేడాదే ప్రత్యేక బిల్లు తేవాలని భావించింది. దీనికి న్యాయ శాఖ కూడా ఆమోదం తెలిపింది. కానీ, దీన్ని కేంద్ర హోం శాఖ వెనక్కి పంపింది.