కరోనా నుంచి కోలుకుని వచ్చిన వారికి స్వాగతం పలికిన వారిపై కేసు నమోదు!

  • ఢిల్లీకి వెళ్లి వచ్చిన తమిళనాడు వ్యక్తికి  కరోనా
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినప్పుడు ఘన స్వాగతం
  • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు  నమోదు
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, ఇంటికి వస్తున్న వారికి పలుచోట్ల స్వాగతం పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇలా స్వాగతం పలికిన వారికి తమిళనాడు పోలీసులు షాకిచ్చారు. తిరువావూర్ కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీకి వెళ్లి తిరిగొచ్చాడు. కరోనా లక్షణాలతో తిరువారూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాడు. పది రోజుల తర్వాత ఆయనను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.

ఆసుపత్రి నుంచి తన నివాస ప్రాంతానికి తిరిగి వచ్చిన అతనికి బంధువులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి, ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయి. దీంతో, స్వాగత ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News