బంజారా హిల్స్ లో చక్కర్లు కొట్టిన చిరుత.. వీడియో ఇదిగో!
- కేబీఆర్ పార్క్ వద్ద చిరుత సంచారం
- రోడ్ నంబర్ 12ను దాటిన చిరుత
- అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోటుచేసుకున్న ఘటన
లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నిర్మానుష్యంగా మారింది. పగటి వేళల్లో కొంత జనసంచారం ఉన్నప్పటికీ... రాత్రి సమయాల్లో మాత్రం రోడ్లపై ఏ ఒక్కరూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, జంతువులు, పక్షులు రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు ఆనుకుని ఉన్న కేబీఆర్ పార్కు వద్ద ఇటీవలే నెమళ్లు బయటకు వచ్చి కనువిందు చేశాయి. తాజాగా ఓ చిరుత ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వద్ద ఉన్న రోడ్ నంబర్ 12 ను దాటుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.