భారత్‌లో పెరుగుతోన్న కరోనా కేసులు.. 24 గంటల్లో 1,336 మందికి కరోనా నిర్ధారణ

  • 18,601కు చేరిన కరోనా కేసులు
  • 590 మంది మృతి
  • కోలుకున్న 3,252 మంది
  • మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,666
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా నమోదైన 1,336 కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 18,601కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 590 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 24 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది.
 
ఇప్పటి వరకు కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని చెప్పింది. ఆసుపత్రుల్లో 14,759 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,666కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 232 మంది మృతి చెందారు. 572 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,081కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 431 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్‌లో 1,939 మందికి కరోనా సోకగా, 131 మంది కోలుకున్నారు. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 1,520 మందికి కరోనా సోకింది. వారిలో 457 మంది కోలుకున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 1,576 మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 205 మంది కోలుకోగా, 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌లో 1,485 మంది కరోనా బాధితులున్నారు. 127 మంది కోలుకోగా, 74 మంది మృతి చెందారు.  కేరళలో 408 మందికి కరోనా సోకింది.


More Telugu News