చైనాను వెనకేసుకు వస్తూ, అమెరికాపై రామ్ గోపాల్ వర్మ విమర్శలు!
- కరోనా పాపం చైనా తప్పిదమేనంటున్న అమెరికా
- చైనా నియంత్రణ చర్యలతో అమెరికాలో జలసీ
- 2008 ఆర్థిక మాంద్యానికి, స్వైన్ ఫ్లూలకు అమెరికాదే బాధ్యతా?
కరోనా మహమ్మారి పుట్టుకకు, చైనా చేసిన తప్పిదమే కారణమని అమెరికా సహా, పలు దేశాలు విమర్శిస్తున్న వేళ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. అమెరికా వైఖరిపై విమర్శలు గుప్పించారు. "మిగతా దేశాల మాదిరిగానే చైనా కూడా బాధిత దేశమే. అయితే, చైనావాళ్లు, కరోనాను ఎదుర్కోవడంలో మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించడంతోనే కుళ్లుకుంటున్న కొన్ని దేశాలు, ఉద్దేశపూర్వకంగా నిందారోపణలు చేస్తున్నాయి" అని అన్నారు.
అంతకుముందు, "కరోనా పుట్టుకపై విచారణ జరిపించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి చైనా అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చింది. 'హెచ్1ఎన్1, ఇన్ ఫ్లూయంజా, హెచ్ఐవీ/ఎయిడ్స్, 2008 ఆర్థిక మాంద్యం తదితరాలు అమెరికాలో పుట్టి, ప్రపంచానికి విస్తరించి బాధించాయి. వాటన్నింటికీ అమెరికాయే బాధ్యత వహించాలని కోరవచ్చా" అని ప్రశ్నించారు.