ట్రంప్ సంచలన నిర్ణయం.. వలసలకు ఇక చెక్!
- ఇమ్మిగ్రేషన్‌కు చెక్ పెట్టే ఉత్తర్వులపై నేడు సంతకం
- స్వయంగా వెల్లడించిన ట్రంప్
- భారతీయులపై పెను ప్రభావం
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే క్రమంలో సంచలన నిర్ణయం తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. దేశంలోకి వలసలను నిరోధించేందుకు ఇమ్మిగ్రేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ నేడు సంతకం చేయబోతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఓ అదృశ్య శక్తి (కరోనా) కారణంగా దేశ పౌరుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని, వారి ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఏర్పడిందని ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఈ ఉత్తర్వులపై నేడు సంతకం చేయబోతున్నట్టు కూడా పేర్కొన్నారు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారత్, చైనా దేశస్థులే అత్యధికం. ఇప్పుడీ నిర్ణయం అమల్లోకి వస్తే ఇకపై అమెరికా గడ్డపై అడుగుపెట్టడం కష్టమే. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయం భారతీయులపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.