కేటీఆర్ తో ముస్లిం మత పెద్దల భేటీ

  • కరోనా కట్టడి చర్యలకు సహకరిస్తామన్న మత పెద్దలు
  • మహమ్మారి నుంచి బయటపడటమే తమ లక్ష్యమని వ్యాఖ్య
  • హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో భేటీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ తో ముస్లిం మత పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు పూర్తిగా సహకరిస్తామని కేటీఆర్ కు ముస్లిం మత పెద్దలు చెప్పారు. ఈ మహమ్మారి నుంచి బయట పడటమే తమ ప్రథమ లక్ష్యమని  తెలిపారు. కరోనా వైరస్ ను పూర్తిగా తరిమికొట్టేందుకు తమ వంతు పాత్రను పోషిస్తామని చెప్పారు.

జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో ముస్లిం మత పెద్దలు అక్కడకు వచ్చారు. కేటీఆర్ ను కలిసిన వారిలో మత పెద్దలు ముఫ్తీ ఖలీల్ అహ్మద్, ఖుబుల్ పాషా సత్తారి, మహ్మద్ పాషా, ఇఫ్తికారి పాషా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ ఒక విన్నపం చేశారు. రంజాన్ మాస ప్రార్థనలను ఇంటి వద్దనే ఉండి చేసుకోవాలని ముస్లింలను కోరుతున్నానని చెప్పారు. ఈ భేటీలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ  మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా ఉన్నారు.


More Telugu News