కరోనా నుంచి కోలుకున్నంత మాత్రాన ఇమ్యూనిటీ వచ్చేసినట్టేనా..?
- ఓ నెలపాటు వ్యాధినిరోధకశక్తి పనిచేస్తుందన్న పరిశోధకులు
- కోతులపై అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు
- ఆ అధ్యయనంపైనా సందేహాలు
మానవాళిని పట్టి పీడిస్తున్న అత్యంత కఠినమైన వైరస్ కరోనా. ఇది ప్రధానంగా మానవుల శ్వాస వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలను కబళించగల శక్తిమంతమైన వైరస్. దీనికి వ్యాక్సిన్ లేదు, ప్రత్యేకమైన చికిత్స విధానం కూడా లేదు. వ్యాధి లక్షణాలు, రోగి ఆరోగ్య స్థితిని బట్టి ఔషధాలు వాడుతూ చికిత్స కొనసాగిస్తున్నారు. సాధారణంగా వైరస్ వ్యాధులను జయించినవారిలో ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) ఏర్పడుతుంది. మరలా ఆ వైరస్ వారిపై దాడి చేస్తే ఎదుర్కోగల యాంటీబాడీస్ వారి శరీరంలో ఉంటాయి. అయితే ఇది కరోనా వైరస్ కు కూడా వర్తిస్తుందా? కరోనా నుంచి కోలుకున్నవారిలో దాన్ని ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చేసినట్టేనా? అనే ప్రశ్నలు పరిశోధకుల్లో ఉదయిస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు ఎవరిలోనూ స్పష్టమైన సమాధానాలు లేకపోయినా, కొందరు పరిశోధకులు మాత్రం కరోనాను గెలిచిన వారిలో దానికి సంబంధించిన ఇమ్యూనిటీ కొద్దికాలం పాటు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మానవుల్లోని వ్యాధినిరోధక వ్యవస్థలు ఒకసారి దాడి చేసిన వైరస్ ను గుర్తుంచుకుంటాయని, తద్వారా అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే నివారిస్తాయని మార్సెల్లీస్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎరిక్ వివియర్ తెలిపారు. కాగా, మీజిల్స్ (తట్టు) వంటి వ్యాధుల్లో ఒక్కసారి ఇమ్యూనిటీ ఏర్పడితే జీవితకాలం ఆ జబ్బు మళ్లీ దరిచేరదు.
అయితే, కరోనా వైరస్ వంటి ఆర్ఎన్ఏ క్రియాశీలత ఎక్కువగా ఉండే వైరస్ లు సోకినప్పుడు మానవుడిలో యాంటీబాడీలు ఏర్పడేందుకు మూడు వారాలకు పైగా పడుతుందట. అప్పటికీ కూడా ఆ వ్యాధి నిరోధక శక్తి తాత్కాలికంగానే ఉంటుందని, కొన్నినెలల పాటు మాత్రమే రక్షిస్తుందని వివియర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ పట్ల మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని, దీనికి సంబంధించిన డేటా తక్కువగా ఉన్నందున, ఈ వైరస్ ను ఎదుర్కొనే ఇమ్యూనిటీపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశాల్లేవని లండన్ లోని యూనివర్సిటీ కాలేజ్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకో బల్లౌక్స్ అభిప్రాయపడ్డారు.
ఇక, చైనాలో ఇటీవల జరిగిన అధ్యయనంలో మాత్రం ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కొన్ని కోతులపై కరోనా వైరస్ ను ప్రయోగించి, ఆపై వాటికి ఔషధాలు ఇచ్చారు. దాంతో ఆ కోతులు కరోనా బారి నుంచి కోలుకున్నాయి. ఆశ్చర్యకరంగా వాటిపై మళ్లీ కరోనా ప్రయోగించగా, ఈసారి వైరస్ మహమ్మారి ఆ కోతులను ఏమీ చేయలేకపోయింది.
అయితే ఈ పరిశోధనాత్మక అధ్యయనం కేవలం నెల వ్యవధిలోనే చేసినందున కోతుల్లో తాత్కాలిక వ్యాధినిరోధక శక్తి వైరస్ ను ఎదుర్కొని ఉండొచ్చని, దీర్ఘ నిడివి గల పరిశోధనా ఫలితాలనే విశ్వసించవచ్చని పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకుడు ఫ్రెడెరిక్ టాంగీ పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో కరోనా నుంచి కోలుకున్న కొందరు పేషెంట్లు మళ్లీ కరోనా బారినపడడం కూడా టాంగీ అభిప్రాయాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలాంటి సందేహాలన్నింటికి వ్యాక్సిన్ ఒక్కటే జవాబు అని ఆస్ట్రేలియాలోని పెర్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్చీ క్లెమెంట్స్ తిరుగులేని సమాధానం చెప్పారు.