సినిమా తీసి నష్టపోయాను: హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి

  • కథ నచ్చి నిర్మాతగా మారాను
  •  దర్శకత్వం కూడా చేశాను
  • అవకాశాలు తగ్గాయన్న శ్రీనివాసరెడ్డి
హాస్యనటుడిగా శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వుంది. ఒక వైపున కమెడియన్ గా చేస్తూనే, మరో వైపున హీరోగాను ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'  స్క్రిప్ట్ ను నేను ఎంతో ఇష్టపడి రాసుకున్నాను. అందువలన నేనే నిర్మించాలనీ .. దర్శకత్వం వహించాలని అనుకున్నాను .. చేశాను.

అయితే సినిమా ఫలితం నన్ను చాలా నిరాశ పరిచింది. ఆ సినిమా వలన నిర్మాతగా నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. ఇండస్ట్రీ వైపు నుంచి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అనుభవం వున్న దర్శకుడిలా తీశావని కొంతమంది అంటుంటే మాత్రం ఆనందం కలిగింది. ఇక హీరో అయిన తరువాత కమెడియన్ గా నాకు అవకాశాలు తగ్గాయి. కమెడియన్ గా చేస్తానో లేదోనని అనుకుంటున్నారు. కమెడియన్ గా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే"అని స్పష్టం చేశాడు.


More Telugu News