సందట్లో సడేమియా అన్నట్లు నీ సంపాదనలో నువ్వున్నావు జగన్: కేశినేని నాని

  • కరోనా కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు
  • ఓ ప్రకటన విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
  • దాన్ని పోస్ట్ చేసిన కేశినేని నాని
  • దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్య
కరోనా పరీక్షల కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక్కో కిట్‌ను 730 రూపాయల చొప్పున లక్ష కిట్లను దిగుమతి చేసుకుందని అందులో ఉంది. అంతేగాక, రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ప్రత్యేకమైన క్లాజును పెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో రూ.337కి కొనుగోలు చేసినట్టు ప్రచారం జరిగిన విషయంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. పర్చేజ్ ఆర్డర్‌లో షరతు మేరకు చెల్లింపులు చేస్తామని తెలిపింది.

ఈ ప్రకటనను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన టీడీపీ నేత కేశినేని నాని విమర్శలు గుప్పించారు. 'దొరికే వరకూ అందరూ దొరలే. భాగవతం బయట పడిన తరువాత ఇప్పుడు డబ్బులు తగ్గించి ఇస్తాం అని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు.⁦ ప్రజలు ప్రాణ భయంతో వుంటే సందట్లో సడేమియా అన్నట్లు నీ సంపాదనలో నువ్వున్నావు' అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.  
  ⁦


More Telugu News