పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఆయనను కలిశాను.. కానీ కుదరలేదు: రాజమౌళి
- ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది
- ప్రజాసేవ వంటి వాటిపై ఉంది
- సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం
- నేనేమో రోజుల కొద్దీ సినిమాలు తీస్తుంటాను
దిగ్గజ దర్శకుడు రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని చాలా మంది అభిమానులు చాలా ఆరాట పడుతున్నారు. అయితే, ఆయనతో కలిసి సినిమా తీసే అవకాశాలు లేవని రాజమౌళి చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం షూటింగులు జరగట్లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌తో సినిమాపై స్పందించారు.
'పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఈ విషయంలో ఆయనను గతంలో కలిశాను.. కానీ, కుదరలేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ వంటి వాటిపై ఉంది. సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది' అని చెప్పారు.
'మరోవైపు, నేనేమో రోజుల కొద్దీ సినిమాలు (ఆలస్యంగా) తీస్తుంటాను. పవన్‌తో సినిమా తీసే అవకాశం లేదు. సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న కసిగానీ పవన్ కల్యాణ్‌లో 100 శాతం ఉంటే.. నాలో మాత్రం 0.5 ఉంటుంది. ఆయన దృక్పథాన్ని నా దృక్పథంతో పోల్చి చూడొద్దు. పవన్ కల్యాణ్ సినిమా రంగంలో ఉన్న మంచి భవిష్యత్తు నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు' అని రాజమౌళి వ్యాఖ్యానించారు.