కనీసం కేసీఆర్ నిర్ణయాలనైనా కాపీ, పేస్ట్ చేయండి!: జగన్‌కు సోమిరెడ్డి సూచన
- కేసీఆర్ సుదీర్ఘంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించారు
- సడలింపులు లేని లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు స్పష్టతనిచ్చారు
- పేదలకు సాయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు
- ఏపీలోనే అర్థం కాని పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై విమర్శలు గుప్పిస్తోన్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి.. తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించారు. ఏపీ సీఎం జగన్ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
'తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించి సడలింపులు లేని లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు స్పష్టతనిచ్చారు. పేదలకు సాయంలో ప్రత్యేక శ్రద్ధతో పాటు పంటల సేకరణకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోనే అర్థం కాని పరిస్థితి. కనీసం కేసీఆర్ నిర్ణయాలనైనా కాపీ, పేస్ట్ చేయండి' అని సోమిరెడ్డి సూచించారు.
కాగా, తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అలాగే, కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ సడలింపులు ఏమీ ఇవ్వలేదు. ఈ విషయాలన్నింటినీ సోమిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి మరోసారి గుర్తు చేశారు. వలస కార్మికులకు, పేదల కడుపునింపుతూ తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.