విధుల్లో చేరాలని సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు ఆదేశం

  • అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రావాలని సూచన
  • రవాణా సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడి
  • లాక్‌డౌన్‌తో ఇప్పటి వరకు వారం షిప్ట్‌లు
అమరావతిలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ చేసింది. విభాగాధిపతులు, ముఖ్యమైన వారిని రెండు బృందాలుగా విభజించి ఒక్కో వారం ఒక బృందానికి విధులు అప్పగించాలని కోరిన విషయం తెలిసిందే. తాజాగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరుకావాలని, వారికోసం ప్రజా రవాణా సౌకర్యాన్ని సమకూర్చనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ సర్క్యులర్‌ ను జారీ చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ వెల్లడించారు.


More Telugu News