మసీదులో దాక్కున్న 10 మంది ఇండోనేషియన్లు.. జైలుకు తరలించిన పోలీసులు

  • తబ్లిగీ జమాత్ సదస్సు తర్వాత ధన్‌బాద్‌కు
  • గోవిందాపూర్ మసీదులో రహస్యంగా మకాం
  • స్థానిక కోర్టు ఆదేశాలతో అరెస్ట్
వీసా నిబంధనలు ఉల్లంఘించి మసీదులో దాక్కున్న పదిమంది ఇండోనేషియన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని క్వారంటైన్‌కు తరలించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాధ్‌లో జరిగిందీ ఘటన. ధన్‌బాద్‌లోని మసీదులో రహస్యంగా దాక్కున్న తబ్లిగీ సభ్యులను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు క్వారంటైన్‌కు పంపాలని, ఆ తర్వాత జైలుకు పంపాలన్న స్థానిక కోర్టు ఆదేశాలతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

ఢిల్లీ నిజాముద్దీన్‌లో గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సుకు వీరంతా హాజరయ్యారు. వీసా నిబంధనల ఉల్లంఘనతోపాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం- 2005 కింద ఇండోనేషియా వాసులను అరెస్ట్ చేసినట్టు ధన్‌బాద్ పోలీసు అధికారి సురేంద్రసింగ్ తెలిపారు. తబ్లిగీ జమాత్ సమావేశం ముగిసిన అనంతరం ధన్‌బాద్ చేరుకున్న వీరంతా గోవింద్‌పూర్ మసీదులో దాక్కున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News