'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ అడవిలోకి ఎంటరైన తరువాతే అసలు కథ!

  • అన్యాయాన్ని ప్రశ్నించే పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్
  • వాళ్లకి మార్గ నిర్దేశం చేసే పాత్రలో అజయ్ దేవగణ్
  • అడవి నేపథ్యంలో సాగే కథనం ఆసక్తికరం  
అటు ఎన్టీఆర్ అభిమానులు .. ఇటు చరణ్ ఫ్యాన్స్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కొమరమ్ భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. కథాపరంగా ఈ ఇద్దరూ ఎలా కలుసుకుంటారనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమ తమ గ్రామాల్లో అన్యాయాలను సహించకుండా ప్రశ్నించేవిగా ఈ రెండు పాత్రలు కనిపిస్తాయట.

ఒకానొక సందర్భంలో వేరు వేరుగా ఈ రెండు పాత్రలు అజ్ఞాతంలోకి వెళతాయి. అడవితల్లిని ఆశ్రయించిన ఈ ఇద్దరికీ అక్కడ స్వాతంత్ర్యకాంక్ష కలిగిన యోధుడైన అజయ్ దేవగణ్ తారసపడతాడు. ఆయన భావజాలం ఆ ఇద్దరి పాత్రలను ప్రభావితం చేయడంతో, తమలోని శక్తియుక్తులను స్వాతంత్ర్య సాధనకు వినియోగిస్తారని అంటున్నారు. అడవి నేపథ్యలో సాగే సన్నివేశాలు అదరహో అనే స్థాయిలో వుంటాయని చెబుతున్నారు.


More Telugu News