ఊపిరి పీల్చుకుంటున్న స్పెయిన్.. తగ్గుతున్న కరోనా మరణాలు

  • గత 24 గంటల్లో 410 మంది మృతి
  • 20 వేలకు చేరిన మృతుల సంఖ్య
  • అత్యవసర స్థితి మరో రెండు వారాల పొడిగింపు
కరోనాతో విలవిల్లాడిన స్పెయిన్ ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న అతి తక్కువగా 410 మంది మాత్రమే కరోనా మహమ్మారికి బలయ్యారు. దాదాపు నెల రోజుల క్రితం అక్కడ సంభవించిన మరణాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అలాగే, నిన్న కొత్తగా మరో 4,218 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అక్కడ మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,95,944కు పెరిగింది. 20 వేల మంది మృతి చెందారు.

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో విధించిన అత్యవసర స్థితిని మరో రెండువారాలపాటు పొడిగిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. కరోనా కట్టడి విషయంలో తాము సరైన దారిలోనే వెళ్తున్నట్టు ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయని ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి ఫెర్నాండో సైమన్ పేర్కొన్నారు. మరోవైపు, అత్యవసర పరిస్థితి పొడిగించినప్పటికీ, ఈ నెల 27 నుంచి పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.


More Telugu News