ర్యాపిడ్ టెస్టు కిట్లు వినియోగించకుండానే రెండో స్థానంలో నిలిచిన ఏపీ

  • ప్రతి 10 లక్షల మందికి ఏపీలో 539 కరోనా టెస్టులు
  • 685 పరీక్షలతో రాజస్థాన్ అగ్రస్థానం
  • నిన్న ఒక్కరోజే ఏపీలో 5,400 కరోనా టెస్టులు
ఏపీ ఇటీవల కరోనా కట్టడిలో భాగంగా దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ కిట్లను జిల్లాల వారీగా అందించి భారీగా కరోనా టెస్టులు చేయాలన్నది సర్కారు యోచన. అయితే, ఈ ర్యాపిడ్ కిట్లను వినియోగించకుండానే ఏపీ ప్రభుత్వం గణనీయమైన పురోగతి కనబరుస్తోంది. దేశం మొత్తమ్మీద అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో రాజస్థాన్ మొదటిస్థానంలో ఉంది. ప్రతి 10 లక్షల మందికి రాజస్థాన్ లో 685 పరీక్షలు నిర్వహిస్తుంటే, ఏపీలో 539 పరీక్షలు చేపడుతున్నారు. నిన్న ఒక్కరోజే ఏపీలో 5,400 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైసీపీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.


More Telugu News