టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అవంతి సవాల్
- ఒక్క పాజిటివ్ కేసును అయినా దాచిపెట్టినట్టు నిరూపిస్తారా?
- నిరూపిస్తే కనుక నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా
- లేనిపక్షంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజీనామా చేయాలి
ఏపీలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్యను సరిగా బయటపెట్టడం లేదంటూ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక్క పాజిటివ్ కేసును తాము దాచినట్టు నిరూపించ గలిగితే ‘నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ను అని, లేనిపక్షంలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. నమూనాల సేకరణ నుంచి నిర్ధారణ పరీక్షల వరకు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని అన్నారు. విశాఖ జిల్లాలో ఇవాళ మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 21 బాధితుల్లో 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు.