అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 850 కి.మీటర్లు సైకిల్‌ తొక్కుతూ వెళ్లిన యువకుడు.. చివరకు కథ అడ్డం తిరిగింది!

  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • పంజాబ్‌ నుంచి యూపీకి వెళ్లిన యువకుడు
  • క్వారంటైన్‌కు తరలించిన పోలీసులు
లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పెళ్లిళ్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తన పెళ్లి వాయిదా వేయదలుచుకోలేని ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సోనూ పని నిమిత్తం పంజాబ్‌లో ఉంటున్నాడు. అతడికి ఇప్పటికే పెద్దలు ఓ అమ్మాయితో అతడికి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది దీంతో పెళ్లి చేసుకోవడానికి పంజాబ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు సైకిల్‌పై  బయలు దేరాడు. రాత్రింబవళ్లు సైకిల్‌ తొక్కుకుంటూ వారం రోజుల్లో ఏకంగా 850 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరికొన్ని గంటలు సైకిల్‌ తొక్కితే ఇళ్లు చేరుకునే వాడు, పెళ్లి జరిగేది.  

అయితే ఇంటికి మరో 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంది. సొంత జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో సరిహద్దులో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అతడి నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అతడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

అతడికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని, నెగిటివ్‌ అని తేలితే 14 రోజుల పర్యవేక్షణ అనంతరం ఇంటికి పంపుతామని స్పష్టం చేశారు. తాను పెళ్లి చేసుకుంటానని అతడు ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులు అతడిని వదల్లేదు.  



More Telugu News