కరోనా పై రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి : వైసీపీ ప్రభుత్వానికి సుజనా సలహా
- కేంద్ర మార్గదర్శకాలను జగన్ పాటించడం లేదు
- ఇష్టానుసారం వ్యవహరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు
- పాలనలో విఫలమైతే ప్రజలకు నష్టం
కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసినా జగన్ ప్రభుత్వం వాటిని పాటించడం లేదని, దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ రోజు ఆయన ఓ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ కరోనాను కట్టడి చేద్దామన్న చిత్తశుద్ధి వైసీపీ ప్రభుత్వంలో కనిపించడం లేదని విమర్శించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. పాలనలో విఫలమైతే ఆ ప్రభావం ప్రజలపై ఉంటుందన్నారు. కొరియా నుంచి కరోనా టెస్ట్ కిట్లను ఎందుకు తీసుకురావల్సి వచ్చిందని, దానివల్ల లాభాలేంటో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మంచి మెజార్టీ ఉందని, మంచిపాలన అందించి ప్రజల మెప్పుపొందాలని హితవు పలికారు.