అమెరికాలో ఇప్పటివరకు 38,664 మంది మృతి.. ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన మరణాలు
- 24 గంటల్లో అమెరికాలో 1,891 మంది మృతి
- 7,32,197 మందికి కరోనా
- ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 1,57,539
- రష్యాలో భారీగా పెరిగిపోతోన్న కేసులు
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిపోయింది. రోజురోజుకీ వేల సంఖ్యలో బాధితులు, మృతులు పెరిగిపోతున్నారు. 24 గంటల్లో అమెరికాలో 1,891 మంది మృతి చెందారు. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 38,664 మంది ప్రాణాలు కోల్పోయారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 7,32,197గా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత మంది కరోనా పాజిటివ్ రోగులు, మృతులు అమెరికాలో ఉన్నారు. యూరప్‌లో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,539 గా ఉంది.
అందులో మూడింట రెండు వంతుల మంది యూరప్ వాసులే ఉన్నారు. రష్యాలో కరోనా బాధితుల సంఖ్య శర వేగంగా పెరిగిపోతోంది. 24 గంటల్లో 4,785 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 36,793 మంది కరోనా బారిన పడ్డారు. ఆ దేశంలో మృతుల సంఖ్య 313గా ఉంది.
యూకేలో కరోనా కేసుల సంఖ్య 24 గంటల్లో 888 పెరిగింది. ఇప్పటివరకు యూకేలో 15,464 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు 3,57,023 మందిని పరీక్షించగా 114,217 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈజిప్టులో కరోనా కేసుల సంఖ్య 3,000కు పైగా నమోదైంది.
స్పెయిన్‌లో 20,600 మంది కరోనాతో మృతి చెందగా, ఇటలీలో 23,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాన్స్‌లో 19,323 మంది మృతి చెందగా, జర్మనీలో 4,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 23,32,000గా ఉంది.