ఆంధ్రప్రదేశ్‌లో మరో 44 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
- ఇప్పటివరకు మొత్తం 647 పాజిటివ్ కేసులు
- 65 మంది డిశ్చార్జ్
- కర్నూలులో అత్యధికంగా 158 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 65 మంది డిశ్చార్జ్ కాగా, 17 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా కేసుల సంఖ్య 565గా ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 158 కేసులు నమోదు కాగా, వారిలో 153 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఆ జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 129 కేసులు నమోదయ్యాయని చెప్పింది. గుంటూరులో మొత్తం 125 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 65 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 42 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.
ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?