దేశంలో 15,000 దాటిన కరోనా కేసులు... పెరిగిపోయిన మరణాలు
- 15,712కి చేరిన కరోనా కేసులు
- ఇప్పటివరకు మొత్తం 507 మంది మృతి
- మహారాష్ట్రలో 3,651 మంది బాధితులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15 వేలు దాటింది. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,712కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 507 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు కరోనా నుంచి 2,231 మంది కోలుకున్నారని చెప్పింది. ఆసుపత్రుల్లో 12,974 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,651కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 211 మంది మృతి చెందారు. 365 మంది కరోనా రోగులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,893 కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 72 మంది కోలుకున్నారు. 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో 1,372 మందికి కరోనా సోకింది. వారిలో 365 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లో 1,351 మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 183 మంది కోలుకోగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్‌లో 1,407 మంది కరోనా బాధితులున్నారు. 127 మంది కోలుకోగా, 70 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో 805 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కేరళలో 400 మందికి కరోనా సోకింది.