రాజస్థాన్ కు 250 బస్సులను పంపిన ఉత్తరప్రదేశ్... 'అన్యాయం' అన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్!
- రాజస్థాన్ లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులు
- వారిని వెనక్కు తీసుకుని వెళ్లాలన్న అశోక్ గెహ్లాట్
- లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కడమే
- ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న నితీశ్ కుమార్
రాజస్థాన్ లో కోచింగ్ సెంటర్లు అధికంగా ఉండే కోటా పట్టణంలో చిక్కుబడిపోయిన తూపీకి చెందిన వందలాది మంది విద్యార్థులను స్వస్థలానికి చేర్చేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు 250 బస్సులను పంపించగా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదకర కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా లాక్ డౌన్ అమలవుతోందని గుర్తు చేసిన ఆయన, ఈ సమయంలో బస్సులను అంతదూరం పంపించి విద్యార్థులను వెనక్కు రప్పించడం లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కడమే అవుతుందని విమర్శించారు.
వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడిపోయిన విద్యార్థులు, తమను స్వస్థలాలకు చేర్చాలంటూ 'సెండ్ అజ్ బ్యాక్ హోమ్' హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించడంతో, దీనిపై స్పందించిన తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది. ఆపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం, తమ రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులను తీసుకుని వెళ్లాలని కోరారు. ఈ దిశగా యూపీ దారిలో నడవాలని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
యోగి సర్కారు తీసుకున్న నిర్ణయం బీజేపీ మిత్రుడైన నితీశ్ కుమార్ కు నచ్చలేదు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, విద్యార్థులను తరలించడం కరోనా మరింత వ్యాప్తికి కారణమవుతుందని, ఇది ప్రజలకు చేసే అన్యాయమేనని ఆయన అభిప్రాయపడ్డారు.