పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

  • అనంతపురం జిల్లా ధర్మవరంలో ఘటన
  • ఈ నెల 25న జరగాల్సిన వివాహం
  • అప్పు పుట్టక ఆగిన పెళ్లి
అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక శాంతినగర్‌కు చెందిన హేమావతి (25) చేనేత కార్మికురాలు. తండ్రి ఇది వరకే మరణించగా, తల్లి కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. తల్లితో కలిసి హేమావతి కూలి మగ్గం నేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది.

ఈ క్రమంలో ఈ నెల 25న హేమావతి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కోసం డబ్బులు అప్పుగా తీసుకోవాలని భావించారు.  అయితే, లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలన్నీ మూతపడడంతో డబ్బులు చేతికి అందే మార్గం కనిపించలేదు. దీంతో పెళ్లి ఆగిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన హేమావతి చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News