మన్మోహన్ సింగ్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సభ్యుడు... కొత్త కమిటీని ప్రకటించిన సోనియా!
- ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వనున్న కమిటీ
- కన్వీనర్ గా రణదీప్ సుర్జేవాలా
- వెల్లడించిన కేసీ వేణుగోపాల్
ఇండియాలో నెలకొన్న పరిస్థితులు, కీలకాంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, పార్టీ తరఫున తీసుకోవాల్సిన నిర్ణయాలను సూచించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఓ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారు.
ఈ విషయాన్ని వెల్లడించిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, ఈ టీమ్ ప్రతి రోజూ ప్రత్యక్షంగా, పరోక్షంగా సమీక్షలు జరుపుతుందని ఆయన తెలిపారు. కమిటీ కన్వీనర్ గా రణదీప్ సుర్జేవాలా వ్యవహరిస్తారని, రాహుల్ గాంధీ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. మాజీ మంత్రులు పీ చిదంబరం, మనీశ్ తివారీ, జైరాం రమేశ్, పార్టీ నేతలు ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లభ్, సుప్రియా శ్రీనాటే, రోహన్ గుప్తాలు కూడా సభ్యులుగా ఉంటారని తెలిపారు.