కరోనాలోనూ తేడాలు... విదేశీ వైరస్ కన్నా బలంగా మర్కజ్ వైరస్!

  • ఇరాన్, ఇండొనేషియా నుంచి వచ్చిన వైరస్ బలం
  • త్వరగా కోలుకుంటున్న పశ్చిమ దేశాల వైరస్ బాధితులు
  • వైరస్ వ్యత్యాసాలపై పరిశోధనలు సాగాలంటున్న నిపుణులు
కరోనా వైరస్ లోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు వైద్యులు. వివిధ దేశాల నుంచి వచ్చి, వైరస్ సోకిన వారు త్వరగా కోలుకుంటున్నారని, న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలతో లింకుండి, వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ నెగటివ్ రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరణాల్లోనూ మర్కజ్ తో లింక్ ఉన్న వారి సంఖ్యే అధికంగా ఉందని చెబుతున్నారు.

కొన్ని ప్రాంతాల బాధితుల్లో వైరస్ బలహీనంగా కనిపిస్తూ, త్వరగా నిర్వీర్యం అవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ బలంగా ఉందని వెల్లడించారు. ఇటలీ, ఫ్రాన్స్, యూఎస్, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి వచ్చి, కరోనా సోకిన వారిలో వైరస్ స్థాయి బలంగా లేదని, వైరస్ రూపాంతరం చెంది బలహీనపడి వుండవచ్చని నిపుణులు అంచనా వేశారు.

పశ్చిమ దేశాల నుంచి వచ్చి వైరస్ సోకిన వారిలో 60 ఏళ్లు దాటిన వారు కూడా రెండు వారాల్లో కోలుకున్నారని తెలుస్తుండగా, మర్కజ్ బాధితుల్లో 50 ఏళ్లు దాటిన వారు కూడా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని ప్రకారం, ఇండొనేషియా, ఇరాన్ దేశస్థుల్లో ఉన్న వైరస్ చాలా బలమైనదని విశ్లేషిస్తున్నారు. వైరస్ లో వ్యత్యాసాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి వుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News