ఇండోర్ వాసులను బెంబేలెత్తిస్తున్న కరోనా మరణాలు
- రాష్ట్రంలోని 72 మరణాలు ఇక్కడే
- 1400 కేసుల్లో 900 ఇండోర్‌లోనే..
- కరోనాకు కేంద్రంగా మారిన నగరం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ను ఇప్పుడు కరోనా వైరస్ వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 69 మరణాలు నమోదు కాగా, వీటిలో 47 ఒక్క ఇండోర్‌లోనివే కావడం గమనార్హం. అలాగే, కేసుల్లోనూ ఇండోర్‌దే అగ్రస్థానం. రాష్ట్రం మొత్తం మీద 1400 కేసులు నమోదు కాగా, 900 కేసులు ఒక్క ఇండోర్‌లోనే నమోదయ్యాయి. అంతేకాదు, దేశంలో తాజాగా 28 మంది కరోనా కాటుకు బలైతే అందులో 12 మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం ఇక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
మరోవైపు, మహారాష్ట్రలోనూ పరిస్థితి అంతే దారుణంగా ఉంది. కేసుల్లోనూ, మరణాల్లో దేశంలోనే ముందుంది. ఇక్కడ మొత్తం 3,648 కేసులు నమోదు కాగా, 3,072 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 365 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 211 మంది కోలుకున్నారు. మధ్యప్రదేశ్ లాంటి పరిస్థితులే ఇక్కడా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసులు, మరణాల్లో దాదాపు సగం ముంబైలోనే నమోదవుతుండడం అధికారులను కలవరపెడుతోంది.