దేశీయ రూట్లలో మే 4 నుంచి విమానసర్వీసులు నడపనున్న ఎయిరిండియా

  • మే 3తో ముగియనున్న నేషనల్ లాక్ డౌన్
  • టికెట్ల బుకింగ్ పునరుద్ధరించిన ఎయిరిండియా
  • అంతర్జాతీయ రూట్లలో జూన్ 1 నుంచి విమానాలు
కరోనా బీభత్సాన్ని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనుండగా, ఆ మరుసటి రోజు నుంచే దేశీయ రూట్లలో సర్వీసులు నడపాలని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నిర్ణయించింది. ఈ మేరకు బుకింగ్స్ ను పునరుద్ధరించింది. ఇక భారత్ నుంచి ఇతర దేశాల ప్రయాణాలకు మరికొంతకాలం ఆగకతప్పదు.

 ఇతర దేశాల్లోనూ కరోనా లాక్ డౌన్లు కొనసాగుతున్నందున జూన్ 1 నుంచి ఇంటర్నేషనల్ రూట్లలో విమానాలు నడుపుతామని ఎయిరిండియా పేర్కొంది. ప్రస్తుతానికి మే 4 నుంచి ముంబయి, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు వంటి ఎంపిక చేసిన మెట్రో నగరాలకు విమాన సర్వీసులు నిర్వహించనున్నారు. చవకధరల విమానయాన సంస్థ ఇండిగో కూడా మే 4 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇదేబాటలో ఇతర విమానయాన సంస్థలు కూడా మే మొదటి వారం నుంచి సర్వీసులు పునఃప్రారంభించే అవకాశాలున్నాయి.


More Telugu News