దేశంలో కొనసాగుతున్న కొవిడ్-19 ఉద్ధృతి...14 వేలు దాటిన పాజిటివ్ కేసులు
- 488కి పెరిగిన మరణాల సంఖ్య
- 2014 మంది కోలుకున్నారన్న కేంద్రం
- మహారాష్ట్రలో మృత్యుఘంటికలు
భారత్ లో కరోనా విజృంభణకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడంలేదు. నానాటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడమే అందుకు కారణం. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,793 కాగా, మరణాల సంఖ్య 488కి పెరిగింది. ఇప్పటివరకు 2014 మంది కోలుకున్నారని, దేశవ్యాప్తంగా 12,289 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అటు రాష్ట్రాల్లో కరోనా ధాటి కొనసాగుతోంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,323గా నమోదైంది. ఇప్పటివరకు అక్కడ 201 మంది మరణించారు.